మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత

by Thanuru Gopichand |

ప్రజా ప్రతినిధిగానే కాదు.. ప్రజా సేవకురాలిగా కూడా తాను మిన్న అని ఏపీ హోం మంత్రి అనిత మరోసారి నిరూపించుకున్నారు.

మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా ప్రతినిధిగానే కాదు.. ప్రజా సేవకురాలిగా కూడా తాను మిన్న అని ఏపీ హోం మంత్రి అనిత మరోసారి నిరూపించుకున్నారు. పాయకరావుపేట (Payaka Rao Peta) నియోజకవర్గంలోని మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎస్.రాయవరం మండలంలోని బంగారమ్మపాలెం గ్రామాన్ని సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా ప్రజలను పలకరించారు. ప్రతిఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మల పూరిళ్లకు జరిగిన నష్టం గురించి తెలుసుకొని హోం మంత్రి అనిత (Home Minister Anitha) చలించిపోయారు. వారికి తన సొంత డబ్బులతో ఆర్థిక సహాయం చేశారు. మైలిపిల్లి సత్తియమ్మను ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. బాధితులకు వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. తద్వారా మొంథా తుఫాను బాధితులకు స్వాంతన చేకూర్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని హామీనిచ్చారు. బంగారమ్మ పాలెంలో సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఎస్.రాయవరం మండలం కాపులవాతాడకు చెందిన దమ్ము శివను పరామర్శించారు. అతని కష్టాలు చూసి చలించిపోయారు. కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు అలాగే వీల్ చైర్ అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. శివ ఐదేళ్ల క్రితం కొబ్బరి చెట్టు నుంచి జారిపడి మంచానికే పరిమితమయ్యాడు. హోం మంత్రి సహాయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Next Story