- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ఏమీ కాలేదు.. బాగానే ఉన్నా: హోంమంత్రి అనిత
తనకు ఏమీ కాలేదని, బాగానే ఉన్నానని హోంమంత్రి అనిత తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: తనకు ఏమీ కాలేదని, బాగానే ఉన్నానని హోంమంత్రి అనిత తెలిపారు. హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కారు కాన్వాయ్‌కు ఏలూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆమె స్పందించారు. బైక్ అడ్డురావడంతో కారు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని అనిత తెలిపారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి చిన్న దెబ్బ తగిలిందన్నారు. చంద్రబాబు, పవన్, ప్రజలు ఆశీస్సులు ఉన్నంతకాలం తనకు ఏమీ కాదని చెప్పారు. తనకు ప్రమాదం జరిగిందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని హోంమంత్రి అనిత సూచించారు.
కాగా ఆదివారం ఉదయం హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా అలంపురం పర్యటనకు వెళ్తున్న సమయంలో హోంమంత్రి అనిత కాన్వాయ్‌కు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని అనిత కారు మరో కారును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో హోంమంత్రి అనితకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆమె మరో కారులో అలంపురం బయల్దేరి వెళ్లారు.






