- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి లోకేష్‌పై హోంమంత్రి అనిత ప్రశంసలు
రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలకు హోం మంత్రి అనిత ప్రశంసలు తెలిపారు...

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలకు హోం మంత్రి అనిత ప్రశంసలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అద్భుత విజయాలను అభినందిస్తూ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా పత్రికల్లో ప్రచురణ ద్వారా ప్రోత్సహించడం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు.
100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలు
మంత్రి అనిత మాట్లాడుతూ... మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ సత్ఫలితాలు ఇస్తోందని, ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిలవడం గర్వకారణమని అన్నారు. గత ఐదేళ్లలో వెనుకబడ్డ విద్యా రంగాన్ని పునరుద్ధరించి, విద్యార్థులకు ‘అమ్మలా శిక్షణ, నాన్నలా రక్షణ’ అందించే విధంగా చేపట్టిన చర్యలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయని వివరించారు.
ఇటీవల సాధించిన ఘన విజయాలకు విద్యార్థులను అభినందించిన మంత్రి, మరింత ప్రోత్సాహం అందించేందుకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించినందుకు మంత్రి లోకేష్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలని, పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు.






