- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతున్న.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటీవల భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై కూటమి ప్రభుత్వం(AP Government) అప్రమత్తమైంది. ఈ మేరకు ఏపీ(Andhra Pradesh) హోం మంత్రి అనిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో భారీ వర్షాల(Heavy Rains)పై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రానున్న ఐదు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పిడుగులు, ఈదురు గాలులు, వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని హోం మంత్రి అనిత తెలిపారు.






