- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పాక్‌కు అనుకూల పోస్టులు’.. హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం
పహల్గం ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’(Operation sindoor) పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పహల్గం ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’(Operation sindoor) పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్స్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంది.
ఈ తరుణంలో వారం రోజులుగా భారత్–పాక్(India-Pak War) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఇండియా–పాక్ ఉద్రిక్తత వేళ అన్ని రాష్ట్రాల్లో భారీగా రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై తాజాగా హోం మంత్రి అనిత(Home Minister Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో హోం మంత్రి మాట్లాడుతూ.. పహల్గామ్(Pahalgam) సంఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలను స్వాగతించాలని పిలుపునిచ్చారు. స్త్రీని శక్తిగా గౌరవించే దేశంలో స్త్రీ ఎదురుగా కిరాతకానికి పాల్పడ్డ ఉగ్రవాదులను అంతమొందించాలి అన్నారు. పాక్ కవ్వింపు చర్యలు తిప్పికొట్టడంలో భారత దళాలు చేస్తున్న ఎదురు దాడిని ఆమె ప్రశంసించారు.
ఈ క్రమంలో సైనిక నిధికి తాను ఒక నెల జీతాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. పాకిస్తాన్(Pakistan) అనుకూల పోస్టులపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పాక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హెచ్చరించారు. మత ఘర్షణలకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిపై దృష్టిసారిస్తున్నాం అని ఆమె వెల్లడించారు.






