వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. నెల్లూరు, కర్నూల్, నంద్యాల జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత అధికారులకు సహాయకచర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అతిభారీ, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వెంటనే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

Next Story