దిత్వా ఎఫెక్ట్.. రేపు ఆ జిల్లాలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

by Ajay Maddhiboyina |

దిత్వా తుఫాన్ ముప్పుతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాల్లో ముందుగానే అధికారులను అప్రమత్తం చేసింది. తుఫాన్ కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

దిత్వా ఎఫెక్ట్.. రేపు ఆ జిల్లాలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుఫాన్ ముప్పుతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీచ్ లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాల్లో ముందుగానే అధికారులను అప్రమత్తం చేసింది. తుఫాన్ కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. తీరం వెంబడి గంటలకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కడప జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఇప్పటికే తిరుపతిలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించగా ఇప్పుడు కడప జిల్లాలోనూ స్కూళ్లు కాలేజీలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోఫ్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. నది పరివాహక మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story