- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరానికి సమాతరంగా దిత్వా.. రేపు ఏపీలోఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను.. తీరానికి సమాంతరంగా పయనిస్తోందని APSDMA తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను.. తీరానికి సమాంతరంగా పయనిస్తోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది కారైకాల్ కు 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు,చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాన్ ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
స్కూళ్లకు సెలవు
దిత్వా ప్రభావంతో రేపు తిరుపతి జిల్లాలోఅతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు కూడా తుపాను ముప్పు ఉన్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.






