- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Results: ఏపీలో చరిత్ర తిరగరాసిన టీడీపీ
ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాసింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాసింది. గత ఎన్నికల్లో 23 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. టీడీపీ కూటమి అభ్యర్థులు 160 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఉమ్మడి 13 జిల్లాలోనూ టీడీపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకపోతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు పార్లమెంట్ బరిలోనూ దాదాపు 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో విభజిత రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టబోతోందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా మంది మంత్రులు ఓటమి అంచుల్లో ఉన్నారు.






