- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం’: మంత్రి నారా లోకేష్
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు ప్రథమ వర్ధంతి(జూన్ 8) సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు ప్రథమ వర్ధంతి(జూన్ 8) సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ‘‘పద్మవిభూషణ్, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ‘ఈనాడు’ ద్వారా పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారు.
అవినీతి పై అక్షర యుద్ధం సాగించారు. నియంతృత్వ పోకడలపై అలుపెరుగని పోరాటం చేశారు. తన చివరి శ్వాస వరకు ప్రజా శ్రేయస్సు కోసం పరితపించిన వ్యక్తి రామోజీరావు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను’’ మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






