ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. పవన్ ఛాంబర్లో బాలయ్య

by Naga Rani Yarlagadda |

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన కనిపించింది.

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. పవన్ ఛాంబర్లో బాలయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన కనిపించింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడితే మర్యాదపూర్వకంగా పలుకరించుకునే ఇద్దరు నేతలు.. ఛాంబర్లో సమావేశం కావడంతో.. కీలక అంశాలపైనే చర్చించి ఉంటారని సమాచారం. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు, ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోలో ఇద్దరూ కలిసి ఒక వేదికపై కనిపించారు. మళ్లీ చాలాకాలం తర్వాత ఇద్దరూ ఇలా ఎదురెదురుగా కూర్చుని.. రాజకీయ పరమైన అంశాలపై చర్చించడం ఇరు పార్టీల శ్రేణుల్లో చర్చలకు దారితీసింది.

Next Story