- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూ మతం అందరికీ చిన్న విషయమైంది.. డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పట్టు వస్త్రాల స్కామ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పట్టు వస్త్రాల స్కామ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగిన ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గతంలో చాలా దేవస్థానాల్లో అక్రమాలు జరిగాయని, తిరుమల విషయంలో బలమైన టీటీడీ బోర్డు, ఎన్డీఏ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రస్తుతం అన్న అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. అందుకే ఇటీవల కాలంలో వరుసగా స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. “హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణి చోరీ విషయాన్ని “అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు” అని అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. “అదే జగన్ మతంలో కూడా ఇలాంటివి జరిగి ఉంటే.. చిన్న విషయమే అని కొట్టిపారేసేవారా?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో పెద్ద స్కామ్ బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో వీఐపీలు, వీవీఐపీలు, ప్రత్యేక సేవల్లో ఉపయోగించే పట్టు వస్త్రాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలనే నియమం ఉంది. అయితే 2019 నుంచి 2024 వరకు పాలిస్టర్ వంటి నాసిరకం వస్త్రాలను నిజమైన పట్టు వస్త్రాల పేరుతో సరఫరా చేశారని టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. పట్టు వస్త్రం అసలు ధర రూ.100 నుంచి రూ.400 మాత్రమే ఉండగా.. కాంట్రాక్టర్ వాటిని రూ.1,400కి సరఫరా చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. దాదాపు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.54 కోట్లకు పైగా టీటీడీ నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.






