తిరుపతి అలిపిరి దగ్గర హై టెన్షన్‌

by Ajay Maddhiboyina |

తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద హై టెన్షన్ నెలకొంది. జూపార్క్ రోడ్డులో అనుమతి లేని వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లను, ఇతర వ్యాపారాలను అక్కడ నుండి తొలగించారు.

తిరుపతి అలిపిరి దగ్గర హై టెన్షన్‌
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద హై టెన్షన్ నెలకొంది. జూపార్క్ రోడ్డులో అనుమతి లేని వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లను, ఇతర వ్యాపారాలను అక్కడ నుండి తొలగించారు. దాదాపు 40 టిఫిన్ సెంటర్లను అధికారులు అక్కడ నుండి తొలగించారు. దీంతో వ్యాపారులకు మద్దతుగా వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో అలిపిరి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వైసీపీ నాయకులకు అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో ఉండటంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తొపులాట జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అభినయ్ రెడ్డితో పాటు అజయ్, పసుపులేటి సురేష్, మల్లం రవిచంద్ర రెడ్డి,గీతా యాదవ్, వాసు యాదవ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story