- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి ఇంటికి భారీగా పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. అధికార టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టడటంతో.. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. అధికార టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టడటంతో.. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమం పెద్దారెడ్డి ఇంటి వెనుకే జరగనుండటంతో.. పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు.
ర్యాలీ కార్యక్రమాన్ని మరో ప్రాంతానికి మార్చుకోవాలని సూచించగా.. అందుకు ఆయన అంగీకరించలేదు. పోలీసుల అనుమతితోనే ర్యాలీ చేపడుతున్నామని, అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పర్మిషన్ తోనే యాడికి మండలం నుంచి ర్యాలీ చేపడుతున్నామని, ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పెద్దారెడ్డి - పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.






