Palnadu: 11 వేట కొడవళ్ళు, 21 బరిసెలు.. కారం కలిపిన నీళ్లు.. పల్నాడులో హైటెన్షన్!

by Thanuru Gopichand |

ప్రతీకార రాజకీయాలకు పేరుగాంచిన ప్రాంతం పల్నాడులో హైటెన్షన్​నెలకొంది.

Palnadu: 11 వేట కొడవళ్ళు, 21 బరిసెలు.. కారం కలిపిన నీళ్లు.. పల్నాడులో హైటెన్షన్!
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట: ప్రతీకార రాజకీయాలకు పేరుగాంచిన ప్రాంతం పల్నాడులో హైటెన్షన్​నెలకొంది. మాచర్ల రూరల్​ప్రాంతంలో శిరిగిరిపాడులో (Sirigiripadu) ఈ ఉదయం పోలీసులు కార్డెన్​సెర్చ్​నిర్వహించారు. పలు ఇళ్లలో భారీగా మారణాయుధాలు (wepens)స్వాధీనం చేసుకున్నారు. శిరిగిరిపాడులో వారం క్రితం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం జరిగింది. రెండు వర్గాలు దాడులకు సిద్ధమయ్యారంటూ పోలీసులకు సమాచారం అందంది. ఈ క్రమంలో పోలీసులు ఈ రోజు ఉదయం కార్డెన్​సెర్చ్​నిర్వహించారు. ఇక్కడ భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల రూరల్ సర్కిల్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి లోని శిరిగిరిపాడు లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో భాగంగా పలు ఇళ్లలో భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లోపలు ఇళ్లలో మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దాడుల కోసం ఇరు పార్టీల కార్యకర్తలు గోతాలలో భారీగా ఆయుధాలు దాచుకున్నారు. అనుమానం ఉన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేయగా 11 వేట కొడవళ్ళు, రెండు కత్తులు, ఐదు గొడ్డళ్లు, 21 బరిసెలు, 20 ఇనుపరాడ్లు, 16 కర్రలు, 13 బస్తాల లో రాళ్ళు కారం కలిపిన నీళ్లు ఉన్న 8 సీసాల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులలో ఇంచార్జి డీఎస్పీ ఎం హనుమంత రావు, మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ భాషా, వెల్దుర్తి ఎస్ఐ సమందర్ అలీ గురజాల సబ్ డివిజన్లోని అన్ని స్టేషన్ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇక్కడ 17 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరికొందరు పరారీలో ఉన్నారు.

Next Story