Breaking: అంబటి ఇంటి వద్ద కొనసాగుతున్న హై టెన్షన్.. అక్కడే టీడీపీ శ్రేణులు!

by Ramesh Naini |   (  Updated:2026-01-31 15:37:23  IST  )

గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్‌ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడుపై బూతులు మాట్లాడిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

Breaking: అంబటి ఇంటి వద్ద కొనసాగుతున్న హై టెన్షన్.. అక్కడే టీడీపీ శ్రేణులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్‌ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడుపై బూతులు మాట్లాడిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సాయత్రం నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. కారు, ఆఫీస్ పర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇంటి పరిసరాల్లో టీడీపీ శ్రేణులు

ప్రస్తుతం అంబటి ఇంటి పరిసరాల్లో టీడీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. క్షణక్షణం ఉద్రిక్తతంగా మారుతోంది. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతలవారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటున్న టీడీపీ కేడర్‌ మండిపడుతోంద. ఓ పక్క పోలీసులు.. ఇంకోపక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. ఇంట్లోనే ఉన్న అంబటి.. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story