అంబటి ఇంటి వద్ద హై టెన్షన్.. అద్దాలు, కారు ధ్వంసం.. టీడీపీ శ్రేణుల దాడి

by Ramesh Naini |   (  Updated:2026-01-31 14:54:14  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

అంబటి ఇంటి వద్ద హై టెన్షన్.. అద్దాలు, కారు ధ్వంసం.. టీడీపీ శ్రేణుల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటి (ఆఫీస్)ని ముట్టడించారు. వెంటనే ముఖ్యమంత్రికి అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ మహిళా కార్యకర్తలు తరలివచ్చి నిరసన తెలిపారు. కొందరు కార్యకర్తలు ఇంటిపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి, కారు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

అంబటి రాంబాబుపై కేసు నమోదు

అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ శ్రేణులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అంబటి ఇంటికి వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story