- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిప్పుల కొలిమిలా ఏపీ.. ఇంకెన్ని రోజులు సూరీడు?
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులను ప్రజలు "నిప్పుల కొలిమి"గా వ్యవహరిస్తున్నారు. ఏసీలోనుంచి బయటికి వస్తే ఓవెన్ లోకి వచ్చినట్లుందంటూ మళ్లీ ఏసీ గదులకే పరిమితమయ్యారు.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఎండలు మరో మూడు, నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు రాకుండా ఉండాలని, తగినంత నీరు తాగడం, తేలికైన దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శుక్రవారం నరసాపురంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బాపట్లలో 41, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలులో 40, తుని, నెల్లూరులో 39.5, కాకినాడలో 39, వైజాగ్ లో 38.5, తిరుపతిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంటుటెండలకు అల్లాడిపోతున్న ప్రజలు ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు.
శనివారం మధ్యాహ్నం తర్వాత.. కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.






