ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్.. డీజీపీ నిద్ర పోతున్నారా అంటూ ఫైర్

by Vemula.Srinu Prasad |

ఏపీ పోలీసులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ..

ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్.. డీజీపీ నిద్ర పోతున్నారా అంటూ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీసుల(Ap Police)పై హైకోర్టు(High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల(Tirumala) పరకామణి కేసు విచారణలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి(Parakamani)లో జరిగిన అక్రమాలకు సంబంధించి రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇస్తే ఇప్పటి వరకూ పట్టించుకోలేదని మండిపడింది. సీఐడీ(CID)లో ఐజీ పోస్టు లేదనే కారణంతోనే ఉత్తర్వులను అమలు చేయలేదని పోలీసు శాఖ తెలపడంపై సీరియస్ అయింది. ఐజీ పోస్టు లేదనే కారణంతో ఉత్తర్వులు అమలు చేయరా అని ప్రశ్నించింది. డీజీపీ, పోలీస్ శాఖ నిద్రపోతోందా అని, పని చేసేది ఇలాగేనా అని నిలదీసింది. రాష్ట్ర పోలీస్ శాఖ మూసివేయడం మేలు అని వ్యాఖ్యానించింది. ఆధారాలు తారుమారు చేయడం కోసమే తప్పు చేశారని కామెంట్స్ చేసింది. ఐజీ స్థాయి అధికారిని నియమించి నిబద్ధత చాటుకోవాలని సూచించింది. రికార్డులు సీజ్ చేసి తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Next Story