- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో జగన్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో టెన్షన్
పల్నాడు (Palnadu) జిల్లా రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో జగన్‌తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. అన్ని పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని వైసీపీ (YCP) ముఖ్య నేతలు, కార్యకర్తల్లో ఓ రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, జగన్ వాహనం కింద సింగయ్య (Singaiah) పడినట్లుగా వీడియో క్లియర్ ఫుటేజ్ లభ్యమైందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ (SP Sathish Kumar) వెల్లడించిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాకే వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ స్పష్టం చేశారు.






