- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్జీవీకి భారీ ఊరట.. కీలక తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andrapradesh High Court)లో భారీ ఊరట లభించింది. 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. టీడీపీ(TDP), జనసేన(janasena) అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు(Indecent posts) పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ(RGV)ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్(Anticipatory bail) ఇవ్వాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (Andrapradesh High Court) ఆశ్రయించారు. దీంతో ఆర్జీవీ(ఆర్జీవీ) పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామ్ గోపాల్ వర్మకు అరెస్ట్ కాకుండా భారీ ఊరట లభించిందని చెప్పుకొవాలి.
- Tags
- Ram Gopal Varma






