- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP High Court: రాంగోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు (Guntur) సీఐడీ (CID) పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Director Ramgopal Varma) ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం రామ్‌గోపాల్ వర్మపై నమోదైన కేసుల విచారణపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2019 సంవత్సరంలో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ (Kamma Rajyamlo Kadapa Redlu) మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రభుత్వం తరఫు లాయర్‌ను ప్రశ్నించింది.
కాగా, సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ramgopal Varma) బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా (Social Media)లో పెట్టాననే ఆరోపణలతో బండారు వంశీకృష్ణ (Bandaru Vamsi Krishna) ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందని క్వాష్ పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) అనుమతి తరువాతే 2019లో ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమా విడుదల చేశామని పిటిషన్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని విచారణపై స్టే ఇవ్వాలని ఆర్జీవీ హైకోర్టును కోరారు.