- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sankranthiki Vasthunam: దుమ్మురేపేస్తున్న వెంకటేశ్.. బాలయ్య ఉండగా మరీ ఇంత సెన్సేషనలా..?
హీరో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది..

దిశ, వెబ్ డెస్క్: హీరో వెంకటేశ్(Hero Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియా(Bheems Cicerolea) సంగీతం అందించారు. వెంకటేశ్ సరసన హీరోయిన్లు మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేశ్(Iswarya Rajesh) నటిస్తున్నారు. కీలక పాత్రల్లో నరేశ్, వీటీ గణేశ్, సాయికుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రంపై తెరకెక్కింది. సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసింపోయింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై అందరూ చూపు పడిన విషయం తెలిసిందే.. అనిల్ రావిపూడి గత చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. మినిమం హిట్ గ్యారంటీ హీరోగా వెంకటేశ్‌కు పేరుంది.
కచ్చితంగా హిట్
దీంతో సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తొలి నుంచే చిత్ర యూనిట్ పెట్టుకుంది. అటు కలెక్షన్లు కూడా భారీ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ మూవీకి ఏపీలో బెన్ ఫిట్ షోల ప్రదర్శనతో పాటు టికెట్ రేట్ పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అయినా సరే వెంకటేశ్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. సినిమాను చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా టికెట్స్‌ను అన్ లైన్ లో కొనుగోలు చేసేశారు.
హైదరాబాద్ సూపర్ రెస్పాన్స్
మరోవైపు హైదరాబాద్(Hyderabad)లో అయితే సూపర్బ్ రెస్పాన్స్ అని థియేటర్లు యజమానులు అన్నారు. ఈ రోజు ఎన్ని షోలు ప్రదర్శిస్తుంటే అన్నింటికీ టికెట్స్ బుక్ అయిపోయాయని చెప్పారు. సినిమా థియేటర్ల వద్ద ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. దీంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఈ జోరు కొనసాగుతుందని భావిస్తున్నారు.. అటు ఏపీలో కూడా సినిమాకు మంచి స్పందన వస్తోందని అంచనా వేస్తున్నారు.
అన్ని షోలకు అమ్ముడు పోయిన టికెట్లు
అటు పండగ సంబురాల్లో ప్రజలు ఉన్నా సినిమా మూడ్ మాత్రం తగ్గలేదంటున్నారు. దీంతో సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని వెంకటేశ్ ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. మరోవైపు సినిమా విడుదల కావడంతో వెంకటేశ్ సత్తా ఏంటో తెలిసిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
హైదరాబాద్‌లో హౌస్ ఫుల్
AMB Cinemas: 13/13
AAA Cinemas: 12/12
PVR Nexus : 14/14
Platinum Gachibowli: 15/15
PVR Atrium: 6/6
PVR Preston Prime: 7/7
PVR RK cineplex: 5/5
Inox Prism Mall: 7/7
Asian Attapur: 10/10
Gokul : 5/5
Cinepolis Attapur: 9/9
Inox Ashoka One: 11/11
Lulu Mall: 12/12
Aparna Cinema Nallagandla: 11/11
Mallikarjuna: 5/5
Cinepolis kompally: 19/19






