- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
58 రోజుల సంకల్పానికి ఇది సజీవ రూపం: మంచు మనోజ్ ట్వీట్ వైరల్
అమరాజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల విగ్రహాన్ని ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సినీ హీరో మంచు మనోజ్ స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: అమరాజీవి పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) 58 అడుగుల విగ్రహాన్ని ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో ప్రభుత్వం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహం ఏర్పాటుపై సినీ హీరో మంచు మనోజ్(Hero Manchu Manoj) స్పందించారు. పొట్టి శ్రీరాములుకు నివాళులర్పిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు, అధికారమూ లేదు. అతని దగ్గర ఉన్నది ఒక్కటే… అచంచల సంకల్పం. అహింసను ఆయుధంగా, నిరాహారాన్ని ప్రతిఘటనగా మార్చిన యోధుడు. 58 రోజుల దీక్ష… ఒక శరీరాన్ని బలహీనపరిచింది, కానీ తెలుగు జాతి స్వాభిమానాన్ని మేల్కొలిపింది. ఆ త్యాగం తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ ఉద్యమం దేశమంతా వ్యాపించి 1956లో భారతదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా నూతన పటాన్ని పొందింది. తెలుగు నాట హరిజనులను ఆలయ ప్రవేశం చేయించిన సంఘసంస్కర్త. భారతదేశంలో భాషా రాష్ట్రాల నిర్మాతగా చరిత్ర గర్విస్తున్న మహనీయుడు. 58 అడుగుల విగ్రహం కేవలం ఒక కొలత కాదు. 58 రోజుల సంకల్పానికి నిలిచిన సజీవ రూపం. కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు. ఒక మనిషి ఉపవాస దీక్ష కూడా!.’’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు






