హెరిటేజ్ ఫుడ్స్ ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డులు

by Thanuru Gopichand |

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం లభించింది.

హెరిటేజ్ ఫుడ్స్ ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ సీఎం చంద్రబాబు సతీమణికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. అందులో ఒకటి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025. రెండోది హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు. నారా భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇనిస్టిట్యూట్ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక అంశాలను ప్రభాశీలురుగా ఉన్నందుకుగా ఈ అవార్డును అందించనుంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ (Golden Peacock) అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది. రేపు జరిగే కార్యక్రమంలో ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) అందించనుంది. ఇప్పటికే వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు.

Next Story