- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తలసేమియా భాదితులకు సహాయార్ధం..
తలసేమియా బాధితుల సహాయార్ధం ఈ నెల 15వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యూజికల్ నైట్ జరగనుంది.

దిశ, డైనమిక్బ్యూరో : తలసేమియా బాధితుల సహాయార్ధం ఈ నెల 15వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యూజికల్ నైట్ జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరగనున్న మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలును నారా భువనేశ్వరి, తమన్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుందన్నారు. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాంమన్నారు. రక్తదానం చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయని తెలిపారు. ఉచితంగా ఈ షో చేస్తానని తమన్గొప్ప హృదయంతో చెప్పాడని అన్నారు. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు...ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుందని ఆమో పేర్కొన్నారు. తమన్ మాట్లాడుతూ ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారని కొనియాడారు.






