ఫార్మసీ.. పారామెడికల్ కోర్సుల్లో ఏపీకి సహకరించండి : మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |   (  Updated:2025-10-23 06:59:51  IST  )

ఫార్మసీ.. పారా మెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికలను రూపొందించేందుకు సహకరించాలని టస్మానియా యూనివర్సిటీని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు.

ఫార్మసీ.. పారామెడికల్ కోర్సుల్లో ఏపీకి సహకరించండి : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్మసీ.. పారా మెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికలను రూపొందించేందుకు సహకరించాలని టస్మానియా యూనివర్సిటీని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. యూనివర్సిటీని సందర్శించిన మంత్రి యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికలను రూపొందించేందుకు సహకారం అందించాలన్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణలో డిజిటల్ హెల్త్ టూల్స్ (ఏఐ, టెలిమెడిసిన్) అనుసంధానించాలన్నారు. ఏపీలోని వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీ ఫార్మా/ హెల్త్ కే నెట్ వర్క్ ను అందించి పరిశ్రమ భాగస్వామ్యాలకు సహకరించాలని విన్నవించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఏపీలోని గిరిజన ప్రాంతాలతో పాటు టాస్మానియా మారుమూల కమ్యూనిటీలపై దృష్టిసారిస్తూ ఉమ్మడి పరిశోధనలు నిర్వహించడానికి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియాలో ఏపీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రొగ్రాం లాంటి స్కల్ ప్రొగ్రాం నిర్వహించాలన్నారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థులకు బెంచ్ మార్క్ స్కిల్ సర్టిఫికేషన్ అందించాలని సహకారాన్ని కోరారు.

READ MORE ...

విక్టోరియా రాష్ట్ర సహకారం కోరిన ఏపీ మంత్రి నారా లోకేష్

Next Story