ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వర్షాల సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story