Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపించాడు. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో ఎండలు దంచికొట్టడంతో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ తరుణంలో సాయంత్రం కాగానే వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. నల్లని మబ్బులతో, చల్లని గాలులతో కాస్త ప్రజలకు ఉపశమనం కలిగించింది.

దీంతో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పార్వతీపురం, అరకు, వైజాగ్, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీశాయి. ఈ క్రమంలో మరో రెండు మూడు రోజులు కూడా ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. వాతావరణంలో చోటుచేసుకుంటున్న భిన్నమైన మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Meteorological department) అధికారులు సూచించారు.

Next Story