విజయవాడలో కుండపోత వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. నేడు న‌గ‌రంలో గంట‌సేపు ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

విజయవాడలో కుండపోత వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. నేడు న‌గ‌రంలో గంట‌సేపు ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేర‌డంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపైకి నీరు చేర‌డంతో ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయితే గత రెండు మూడు రోజుల వరకు ఎండలు మండిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఆందోళన చెందారు.

దాదాపు 40 డిగ్రీల వరకు ఎండ ప్రభావం కనిపించింది. ఇక ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో నిన్నటి నుండి వర్షం కురుస్తోంది. వర్షంతో ఎండల నుండి ఉపశమనం లభించింది అనుకునేలోపు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Next Story