- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో పెరుగుతోన్న వరద నీరు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 1.30789 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 67,019గా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 175.10 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఈ పరిణామంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. ఏ క్షణానైనా శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Next Story






