- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ పేర్కొంది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ పేర్కొంది. ఆ తర్వాతి రెండ్రోజుల్లో ఇది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటవచ్చని అంచనా వేసింది. అయితే.. అల్పపీడనం ఏర్పడటానికి ఒకరోజు ముందు నుంచే.. అంటే నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా.. నేటి నుంచి ఐదురోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా బుధవారం నుంచి శుక్రవారం వరకూ కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ.. 24 గంటల్లో కడప, కర్నూల్, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. ఇక తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఒక్కరాత్రిలోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వైజాగ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
Also Read..
‘మహావతార్ నరసింహా’ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఫుల్ ఖుషిలో చిత్రబృందం






