విజయవాడలో కుండపోత వర్షం.. ఇళ్లలోకి భారీగా నీరు

by srinivas |
విజయవాడలో కుండపోత వర్షం.. ఇళ్లలోకి భారీగా  నీరు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కరెంట్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు బురద పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు సైతం అవస్థలు పడుతున్నారు. అటు మున్సిపల్ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. వర్షం మరోసారి కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు.



Next Story