మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ ప్రాంతానికి బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

మరో మూడు గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది...

మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ ప్రాంతానికి బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్క్ డెస్క్: బంగాళాఖాతం(Bangalakhatam)లో అల్పపీడనం(Low Pressure) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మూడు రోజులుగా అక్కడక్కడా వర్షాలు(Rains) పడుతున్నాయి. మోస్తరు నుంచి భారీగా మారి వానలు విశ్వరూపం చూపిస్తున్నాయి. దీంతో పలుచోట్ల నష్టం భారీగానే ఉంటుంది.

ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ(Weather Department) కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ప్రకటించింది. శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం, విజయనగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుసరావాసాలకు వెళ్లాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, వర్షాలు నెల చివరి వరకు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Next Story