- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో భారీ వర్షం.. సీఎం ప్రయాణానికి ఆటంకం!
by Naga Rani Yarlagadda |
రాష్ట్ర రాజధాని అమరావతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని అమరావతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 6.30 గంటల నుంచి సచివాలయం పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంది. సరిగ్గా బయల్దేరే సమయానికి భారీ వర్షం అడ్డంకిగా మారింది. వర్షం తగ్గకపోవడంతో.. సీఎం చాలా సమయం పాటు సచివాలయంలోనే వేచి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాసేపటి క్రితమే వర్షం తగ్గడంతో సీఎం హైదరాబాద్ కు వెళ్లి.. క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలకు హాజరయ్యారు.
Next Story






