- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాలకు మరో 4 రోజులు భారీ వర్షసూచన
by Naga Rani Yarlagadda |
పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది మంగళవారం (సెప్టెంబర్ 2)కు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో నేటి నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కోనసీమ, తూ.గో, ప. గో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి-మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Next Story






