ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

by Ajay Maddhiboyina |

మొంథా తుఫాన్ ప్రభావం నుండి తేరుకోకముందే ఏపీకి మరోసారి వర్షసూచన ఉందని ఏపీఎస్‌డీఎమ్ఏ అంచనా వేసింది. పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావం నుండి తేరుకోకముందే ఏపీకి మరోసారి వర్షసూచన ఉందని ఏపీఎస్‌డీఎమ్ఏ అంచనా వేసింది. పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా పిడుగుల‌తో కూడిన తేలిక‌పాటి నుండి మోస్త‌రు వ‌ర్షారు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో మెంథా బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. తుషాన్ దెబ్బ‌కు చాలా ప్రాంతాల్లో పంటన‌ష్టం జ‌రిగింది.

స‌ముద్ర ప‌రివాహ‌క ప్రాంతాల్లో బ‌ల‌మైన గాలులు వీచి చెట్లు విరిగిపోవ‌డంతో పాటు ఇల్లు సైతం కూలిపోయాయి. రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింది. అంతే కాకుండా కృష్ణాన‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. మ‌రోవైపు ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రోసారి వ‌ర్ష‌సూచ‌న ఉండటంతో ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో అని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story