- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదికి పోటెత్తిన ప్రవాహం.. పల్నాడు జిల్లాలో భారీగా వరదలు
by Vemula.Srinu Prasad |
ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.5 అడుగులకు నీటిమట్టం చేరింది. ఈ మేరకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు పులిచింతలలో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. దీంతో కృష్ణానది నీరు పల్నాడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లోకి చేరింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి-పెద్దమద్దూరు రహదారిపైనా వరద నీరు నిలిచిపోయింది. అమరావతి, వైకుంఠపురం, పెద్దమద్దూరు ప్రాంతాల్లోని పంటపొలాలు సైతం నీటమునిగిపోయాయి. దాచేపల్లి రామాపురంలోని మత్య్సకారుల కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను దగ్గరుండి పునరావాసాలకు తరలించారు.
Next Story






