తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్ అయి..

by Naga Rani Yarlagadda |

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో (Tirumala) దాదాపు వారంరోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్ అయి..
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో (Tirumala) దాదాపు వారంరోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోసారి కొండపై కంపార్టుమెంట్లన్నీ నిండి..క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ (Krishnateja Guest House) వరకూ పెరిగింది. దీంతో టోకెన్లు లేకుండా ఇప్పటికే క్యూలైన్లో ఉన్న భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని, ఇప్పటి నుంచి క్యూలైన్లోకి వెళ్లేవారికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4-5 గంటల్లో శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుందని పేర్కొంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని చెప్పింది.

నిన్న (మంగళవారం) స్వామివారిని 63,607 మంది భక్తులు దర్శించుకోగా.. 23,856 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారి హుండీఆదాయం రూ.3.87 కోట్లు వచ్చింది. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన అన్నిరకాల దర్శనం టికెట్లను టీటీడీ నిన్న విడుదల చేయగా.. కొద్దినిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Next Story