సింహాచలం గిరి ప్రదక్షిణలో తోపులాట.. పోలీసులు విఫలమయ్యారా ?

by Naga Rani Yarlagadda |

ప్రముఖ పుణ్యక్షేత్రం.. సాక్షాత్తు ఆ అప్పన్నస్వామి కొలువై ఉన్న పవిత్రక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణకు (Simhachalam Giri Pradakshina) భక్తులు భారీగా తరలివచ్చారు.

సింహాచలం గిరి ప్రదక్షిణలో తోపులాట.. పోలీసులు విఫలమయ్యారా ?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సాక్షాత్తు ఆ అప్పన్నస్వామి కొలువై ఉన్న పవిత్రక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణకు (Simhachalam Giri Pradakshina) భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ భక్తజన సందోహాన్ని చూస్తే.. వైజాగ్ బీచ్ (Vizag Beach) ఓ పక్క.. భక్త సంద్రం ఓ పక్క ఉన్నాయా అనిపించకమానదు. రేపు ఆషాఢ పూర్ణిమ (Guru Purnima) సందర్భంగా నేడు నిర్వహించిన గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చినా అందుకుతగిన ఏర్పాట్లు లేవని వాపోతున్నారు. లక్షలాదిగా జనం రావడంతో.. తొక్కిసలాటలు జరుగుతాయా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని భక్తులే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

గిరి ప్రదక్షిణలో తొలి పావంచా వద్ద భారీగా రద్దీ నెలకొనగా.. స్వల్పంగా తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. భక్తులు భారీగా వస్తారని తెలిసినా రోప్ పార్టీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కూడలిలో భక్తులు ఎదురెదురుగా రావడంతో తోపులాటలు జరిగాయి. సింహగిరి ఘాట్ రోడ్డు వద్ద పోలీసుల నియంత్రణ లేకపోవడంతో.. బస్సులు దిగిన భక్తులు తొలి పావంచా వెనుక ఉన్న ఇరుకు సందులో నుంచే భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో తోపులాటలు, ప్రమాదాలు జరుగుతున్నాయని, రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు వేపగుంట కూడలిలో భక్తుల రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువైపు వెళ్లాలో తెలియని క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుతోట, చేములపల్లి, పెందుర్తి, కృష్ణరాయపురం వైపు వెళ్లాల్సిన వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Next Story