కొనకంచిలో హృదయ విదారక ఘటన.. ఒకరి మృతి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-11 02:12:58  IST  )

సీటు బెల్టు పెట్టుకున్నా ప్రాణం నిలవలేదు.

కొనకంచిలో హృదయ విదారక ఘటన.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకరు మృతి చెందిన ఘటన బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన ప్రయాణికులు కారులో బయలుదేరారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలంలోని కొనకంచి (Konakanchi) సమీపంలోకి రాగానే వారి కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. కారు నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు చిక్కుకుపోయారు. అది గమనించిన స్థానికులు సత్వరమే స్పందించారు. వాగులోకి దిగి కారులో ఉన్నవారిని బయటకు తీశారు. అయితే ఒకరు సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా కారులోనే చిక్కుకుపోయారు. ఊపిరాడక ప్రాణాలను కోల్పోయారు. మిగిలిన వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకొని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు తక్షణమే సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకొచ్చారు. అనంతరం జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వ్యక్తి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిల్లకల్లు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

Next Story