బస్సు నడుపుతుండగా హార్ట్ స్ట్రోక్.. 50 మంది క్షేమం

by Muthe.Rajitha |

తన ప్రాణం పోయినా 50 మంది ప్రాణాలు కాపాడాడు ఓ బస్సు డ్రైవర్.

బస్సు నడుపుతుండగా హార్ట్ స్ట్రోక్.. 50 మంది క్షేమం
X

దిశ, వెబ్ డెస్క్ : తన ప్రాణం పోయినా 50 మంది ప్రాణాలు కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మడికి గ్రామానికి చెందిన డి.నారాయణరాజు రాజమహేంద్రవరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొత్తపేట మండలం గంటి నుంచి 50 మంది విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు వెళ్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది.

అయితే డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గించి, రోడ్డు పక్కన నిలిపి స్టీరింగ్‌పై అలాగే కూలిపోయాడు. ఆందోళన చెందిన విద్యార్థులు గమనించి వెళ్లి చూడగా నారాయణరాజు విగతజీవిగా కనిపించాడు. తాను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడారని స్థానికులు, విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.

Next Story