Liquor Case: మిథున్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Gantepaka Srikanth |

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Liquor Case: మిథున్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత మిథున్‌రెడ్డి(Mithun Reddy)కి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. ఆయనతో పాటు నిందితులు వెంకటేష్ నాయుడు, నవీన్ బెయిల్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప పిటిషన్లను కూడా ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లను విచారణను ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేసిన సిట్‌ విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసులో నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు పారిపోయిన వారిని ఏపీకి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే ఇంటర్‌పోల్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Next Story