విశాఖలో టీసీఎస్‌కు నామమాత్రపు ధరకే భూమి: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

విశాఖలో టీసీఎస్‌కు నామమాత్రపు ధరకే భూమి కేటాయించడంపై హైకోర్టులో విచారణ జరిగింది...

విశాఖలో టీసీఎస్‌కు నామమాత్రపు ధరకే భూమి: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజధాని అమరావతి(Amaravati)ని అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీల నుంచి పెట్డుబడులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆయా కంపెనీలను ప్రోత్సహిస్తూ తక్కువ ధరకే భూములు కేటాయించడంపై కొందరు పిటిషనర్లు హైకోర్టు(High Court)లో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రముఖంగా టీసీఎస్‌కు జరిపిన కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఈ వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడుల ఆకర్షణకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని ప్రశ్నించింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, అలాంటప్పుడు నామమాత్రపు ధరకే పలు కంపెనీలకు భూమిని కేటాయించి ఉండవచ్చని, ఎంత రేటుతో భూమిని కేటాయిస్తున్నారని కాదని, ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని సూచించింది. ఐటి వృద్ధి వల్ల హైదరాబాద్, బెంగుళూరు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరం చూస్తున్నాం కదా అని ప్రశ్నించారు. లీజ్ పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామని ధర్మాసనానికి ఎస్‌జీపీ తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌జీపీని హైకోర్టు ఆదేశించింది.

Next Story