- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబద్ధాలలో ఆయనకు ఆస్కార్ ఇవ్వాలి
అబద్ధాలలో జగన్కు ఆస్కార్ఇవ్వాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.

దిశ, డైనమిక్బ్యూరో : అబద్ధాలలో జగన్కు ఆస్కార్ఇవ్వాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. దోచుకోవడం, దాచుకోవడం చూపించడానికే జగన్ 2.0 అవతారం ఎత్తబోతున్నాడని మండిపడ్డారు. పరిపాలన దక్షుడైన చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ పిచ్చికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డిలా చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ లు, ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టు కోలేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టి 8 లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోచుకున్నాడని విమర్శించారు. విపత్తు నిధులు, పోలవరం, గ్రామపంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించాడని, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము రూ.2,100 కోట్లను మింగేసిన తిమింగలాలని ఆరోపించారు. సొంత తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. ఈ ఏడు నెలల్లో ప్రజలెవరైనా ఇబ్బందులున్నాయని జగన్ కి చెప్పారా అని ప్రశ్నించారు. దొంగ మాటలు, కట్టు కథలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారరని హెచ్చరించారు. జగన్ కి విశ్వసనీయత లేనందునే ఆయన పార్టీలో ఎవరూ ఇమడలేక బయటికొస్తున్నారని మంత్రి సంధ్యారాణి విమర్శించారు






