AP Assembly: 2047 నాటికి.. స్వర్ణాంధ్ర కల సాకారం: గవర్నర్​ అబ్దుల్​నజీర్​

by Thanuru Gopichand |

పీపుల్స్​ఫస్ట్​ అనే విధానంలో ఆంధ్రప్రదేశ్​లో 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్​ అబ్దుల్​నజీర్​పేర్కొన్నారు.

AP Assembly: 2047 నాటికి.. స్వర్ణాంధ్ర కల సాకారం: గవర్నర్​ అబ్దుల్​నజీర్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : పీపుల్స్​ఫస్ట్​ అనే విధానంలో ఆంధ్రప్రదేశ్​లో 2047 నాటికి స్వర్ణాంధ్ర (Swarnandhra) కలను సాకారం చేస్తామని గవర్నర్​అబ్దుల్​నజీర్​పేర్కొన్నారు. 2025-26 బడ్జెట్ సమావేశాల(AP Assembly) సందర్భంగా శాసనసభ ఉమ్మడి సమావేశం ఆయన ప్రసంగించారు. ఈ ప్రభుత్వానికి లభించిన అఖండ, చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనం అన్నారు. త ఐదేళ్లలో జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చిందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేస్తూ ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు అధికారం వచ్చిన నాటి నుంచే సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తునట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను నాలుగు వేలకు పెంచడం, డీఎస్సీ నోటిఫికేషన్​ప్రకటించడం, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గుంతలు లేని రోడ్ల నిర్మాణం, ఉచిత ఇసుక పాలసీ విధానం ఇందుకు నిదర్శనమని తెలిపారు.

గత దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత ఎనిమిది నెలల్లో తమ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చామని తెలిపారు. ఇందులో భాగంగా రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేశామని వెల్లడించారు. పోలవరం(polavaram) ప్రాజెక్టు, అమరావతి(Amaravathi) రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామన్నారు.

భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, బిపిసిఎల్, టిసిఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నానమ తెలిపారు. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 2024-25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం రూ.14.22 లక్షల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. ఇది 12.94శాతం నామమాత్రపు వృద్ధి రేటు. మన తలసరి ఆదాయం కూడా గత సంవత్సరంలోని రూ.2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86శాతం, పరిశ్రమలు 6.71శాతం, సేవల రంగం 11.70శాతం చొప్పున వృద్ధి చెందాయని అన్నారు.

Next Story