కన్ను పడిన భూమిని కబ్జా చేసిన ఘనత ఆయనదే : మంత్రి

by Thanuru Gopichand |

అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం.

కన్ను పడిన భూమిని కబ్జా చేసిన ఘనత ఆయనదే : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తన కన్ను పడిన భూమిని కబ్జా చేసిన ఘనత మాజీ సీఎం జగన్ (YS Jagan) రెడ్డిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనంతా దోపిడీ, దుర్మార్గం తప్ప మరేమీ లేదన్నారు. రెవెన్యూ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో రికార్డులన్నింటినీ ట్యాంపర్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడానికి ఏకంగా రూ.700ల కోట్లను దోచుకున్నారని ఎద్దేవా చేశారు.

పేర్ని నానిపై విమర్శలు చేస్తూ.. బీసీ వ్యక్తికి రెవెన్యూ శాఖ ఇవ్వడం కంటగింపుగా ఉందా అని ప్రశ్నించారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో దొంగ పట్టాలిచ్చి పేదల భూములు దోచుకున్న దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరుకు పోర్టు అక్కర్లేదని పేర్ని నాని సంతకం పెట్టిన విషయాన్ని గుర్తు చేవారు. అయితే అదే పోర్టు ప్రారంభించకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని తప్పించుకు తిరిగాడన్నారు. రెండు నాల్కల ధోరణి ఆయనకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. పేర్ని నాని తన జీవితంలో ఒక్కసారైనా నిజం మాట్లాడారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పేదల బియ్యం బొక్కేసిన అతనికి సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు.

జోగి రమేశ్ గురించి ప్రస్తావిస్తూ.. కల్తీ మద్యంలో ప్రజల ప్రాణాలను తీసిన వ్యక్తి అని ఆరోపించారు. తప్పు చేశాననే పశ్చాత్తాపం కూడా లేకుండా పోలీసులనే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పై అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటాం.. అరాచకాలు సృష్టిస్తామంటే తుక్కు రేగ్గొడతాం అని హెచ్చరించారు.

Next Story