- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రలోభాలను బేఖాతరు చేసిన పార్టీ శ్రేణులకు హ్యాట్సాఫ్.. మాజీ సీఎం జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ (YSRCP) గెలుపొందింది. ఇప్పటివరకు 50 స్థానాలకు ఉప ఎన్నికలు (Local Body By Elections) జరగగా అందులో 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ట్విట్టర్ వేదికగా స్పందస్తూ.. పార్టీ శ్రేణుల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు (Coalition Parties) ఎలాంటి బలం లేకపోయినా, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.
అలాగే వైసీపీ నేతలపై కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టారని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారని తెలియజేశారు. అలాగే విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. అంతేగాక క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందించారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ (Hats Off) అని జగన్ రాసుకొచ్చారు.






