- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి జగన్ ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు (Cm Chandrababu) టీమ్ సింగపూర్ (Singapore) పర్యటన బుధవారంతో ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (Cm Chandrababu) టీమ్ సింగపూర్ (Singapore) పర్యటన బుధవారంతో ముగిసింది. ఈ మేరకు వారంతా నిన్న రాత్రి 11:25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమారుగుప్తా, ఎస్పీ గంగాధరరావు, ఇతర అధికారులు చంద్రబాబు టీమ్ ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు పర్యటనపై ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) కీలక వాఖ్యలు చేశారు. పెట్టుబడుల ఆకర్షించమే లక్ష్యంగా సీఎం పర్యటన విజయవంతమైందని తెలిపారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. అమరావతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం (Jagan Government) విదేశీ పర్యటనల పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసిందని కామెంట్ చేశారు. అయినా.. రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు. బాబు పాలనలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనగాని సత్యప్రసాద్ అన్నారు.






