- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా సేవ జీవితానికి నాంది పలికింది అక్కడే’.. హర్యానా గవర్నర్ కీలక వ్యాఖ్యలు
హర్యానా రాష్ట్ర గవర్నర్(Governor of Haryana State) బండారు దత్తాత్రేయను చంఢీఘర్ రాజ్ భవన్‌లో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ఈ రోజు(గురువారం) కుటుంబ సమేతంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా రాష్ట్ర గవర్నర్(Governor of Haryana State) బండారు దత్తాత్రేయను చంఢీఘర్ రాజ్ భవన్‌లో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ఈ రోజు(గురువారం) కుటుంబ సమేతంగా కలిశారు. దివిసీమను ఎన్నటికీ మరచిపోలేనని, తన సేవా జీవితానికి నాంది పలికింది దివిసీమ(Diviseema)లోనే అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. దివిసీమ ఉప్పెన సమయంలో పనిచేసిన వారందరిని గుర్తు చేసుకుని పేరుపేరున వారి గురించి అడిగారు. నాటి ఉప్పెనలో మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవ చరిత్రాత్మకమైనదని దత్తాత్రేయ అన్నారు. కాళ్లలో ముల్లు గుచ్చుకుంటున్న లెక్కచేయకుండా అవిశ్రాంతంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు.
కృష్ణారావు - ప్రభావతి దంపతులు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు మరచిపోలేనన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగు భాష అభివృద్ధికి కృష్ణారావు చేసిన కృషిని బుద్ధప్రసాద్ కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తన ఆత్మకథలో దివిసీమ ఉప్పెన స్మృతులను రాస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ తండ్రి కృష్ణారావు మిమ్మల్ని సోదరునిగా భావించేవారని, మిమ్ములను మా కుటుంబ సభ్యుడిగా మేమెప్పుడూ భావిస్తామని అన్నారు. ఈ సందర్భంగా బుద్ద ప్రసాద్ కుటుంబ సభ్యులను దత్తాత్రేయ ఆత్మీయంగా సత్కరించారు. ఆయనను బుద్ధప్రసాద్, వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, కుమార్తె శీలం కృష్ణ ప్రభ, తనయుడు - కోడలు మండలి వెంకట్రామ్ - మండలి సాయి సుప్రియ దంపతులు పాల్గొన్నారు.






